: 'నకిలీ' వేషాలు తెలుసుకుని షాక్ తిన్న హాలీవుడ్ స్టార్ హీరో


ఈ మధ్య చోటుచేసుకున్న ఓ సంఘటన హాలీవుడ్ హీరో బ్రాడ్లే కూపర్ ను షాక్ కు గురి చేసింది. 2016 సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు బ్రాడ్లే కూపర్ కు ఆహ్వానం అందింది. అయితే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోయాడు. మరుసటి రోజు వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో అభిమానులతో హల్ చేస్తున్న బ్రాడ్లే చిత్రాలు దర్శనమివ్వడంతో అవాక్కయ్యాడు. తానసలు ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లలేదని, ఎవరో తనలా వున్న వ్యక్తి, అక్కడి వారిని బోల్తా కొట్టించాడని వివరణ ఇచ్చాడు. దీంతో అభిమానులు అవాక్కయ్యారు. పలు సందర్భాల్లో అచ్చం తనలా ఉండే వ్యక్తి అభిమానులను మోసం చేస్తున్నాడని బ్రాడ్లే కూపర్ గ్రహించాడు. దీంతో అభిమానులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చాడు.

  • Loading...

More Telugu News