: కోతుల నుంచి తప్పించుకునేందుకు... రెండంతస్తుల భవనం పైనుంచి దూకిన బాలిక


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ప్రజలను కోతులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని కోవూరు మండలం పెళ్లకూరు కాలనీలో కోతుల బెడదతో స్థానికులు ఠారెత్తిపోతున్నారు. ఇవాళ ఉదయం ఒక్కసారిగా కోతులు 11 సంవత్సరాల పల్లవి అనే బాలిక వెంట పడ్డాయి. వాటినుంచి తప్పించుకునేందుకు రెండంతస్తుల భవనం పైనుంచి దూకేసింది. ఈ ఘటనలో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నెల్లూరు ఆసుపత్రికి తరలించి బాలికకు చికిత్స చేయిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News