: ప్రచారానికి రావాలని సుజనా ఫోన్... కుదరదన్న పవన్ కల్యాణ్!


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్న టీడీపీ-బీజేపీ కూటమి, జనసేన అధినేత, ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ ను ప్రచారంలోకి దింపాలని చేస్తున్న యత్నాలు విఫలమవుతున్నాయి. పవన్ కు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ప్రచారం చేయాలని కోరగా, తాను 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ లో బిజీగా ఉన్నందున రాలేనని చెప్పినట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం కొందరు నేతలు ఆయన్ను స్వయంగా కలిసి ఇదే విషయాన్ని విన్నవించినా, పవన్ సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, గతంలో గ్రేటర్ బరిలో జనసేన అభ్యర్థులు ఉంటారని ప్రకటించిన పవన్, ఆపై వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News