: పరారీలో జేఎన్టీయూ కీచకుడు... గాలిస్తున్న పోలీసులు!
అనంతపురం జేఎన్టీయూ అధ్యాపకుడిగా ఉండి, ఎంబీఏ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడి ప్రస్తుతం పరారీలో ఉన్న సుశీల్ కుమార్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గతంలో కదిరి ప్రాంతానికి చెందిన ఓ యువతి కళాశాలలో ఎంబీఏ చదివిన సమయంలో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్న సుశీల్ ఆమెను వేధించాడు. ఆపై ఇటీవల ఓ సబ్జెక్టు పరీక్ష రాసేందుకు ఆ యువతి వెళ్లగా, గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి ప్రమోషన్ పై ప్రొఫెసర్ గా మారిన సుశీల్, అనుచితంగా ప్రవర్తించాడు. తాను చెప్పినట్టు వినకపోతే ఆమ్ల దాడి చేస్తానని బెదిరించాడు. జరిగిన ఘటనలపై సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విషయం తెలుసుకున్న సుశీల్ పరారయ్యాడు. దీంతో అతని కోసం గాలిస్టున్నట్టు పోలీసులు వెల్లడించారు.