: బెంగళూరు 'ప్రకృతి' వైద్యానికి అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పది రోజుల సెలవుపై బెంగళూరుకు వెళ్లనున్నారు. ప్రకృతి వైద్య చికిత్స కోసం ఆయన బెంగళూరు వెళుతున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. బెంగళూరు శివార్లలో ఉన్న జిందాల్ నేచర్ క్యూర్ ఇనిస్టిట్యూట్ లో ఆయన చికిత్స పొందుతారని ఆప్ మీడియా సమన్వయకర్త గోపాల్ వెల్లడించారు. గత సంవత్సరం మార్చిలో కూడా ఆయన కొంత కాలం పాటు ప్రకృతి వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే. విపరీతమైన దగ్గు, షుగర్ వ్యాధితో బాధపడుతుండే ఆయన, నాచురోపతి ద్వారా మేలైన ఉపశమనం తనకు లభిస్తుందని భావిస్తున్నారు. అందువల్లే ఆయన మరోసారి బెంగళూరుకు పయనం కట్టారని సమాచారం.