: నేడు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు!
నేడు ఏపీ పరిధిలోని కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి దీనికి కారణమని, ద్రోణి ప్రభావంతో సముద్రం నుంచి వస్తున్న శీతలగాలులతో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని, తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నిదానంగా పెరుగుతుందని వివరించారు.