: మధ్యాహ్నం నుంచి రంగంలోకి దిగనున్న కేసీఆర్!
వచ్చే నెల 2న జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకి, కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని తెచ్చేందుకు నేటి నుంచి కేసీఆర్ కార్యరంగంలోకి దిగనున్నారు. ఈ మధ్యాహ్నం గ్రేటర్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యే ఆయన, తన ప్రచారంపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. కాగా, కేసీఆర్ కనీసం 3 నుంచి 5 బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, దీనికి అదనంగా మూడు రోజుల పాటు రోడ్ షోలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్న కేటీఆర్, నిత్యమూ గల్లీ గల్లీ తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.