: వీధుల్లోకి సింహం... వణికిపోయిన జనం!
అడవిలో ఉండాల్సిన సింహాన్ని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంది దుబాయ్ లో ఉంటున్న ఒక కుటుంబం. పైగా, ఒక సాదాసీదా బోనులో దానిని బంధించారు. దీంతో ఆ ఆడసింహం బోనులోంచి బయటపడి, వీధుల్లోకి వచ్చింది. ఇంకేముంది!.. ప్రజలు భయంతో వణికిపోయారు... పరుగులు తీశారు. కొన్ని గంటలపాటు వీధుల్లో సంచరించిన సింహాన్ని ఎట్టకేలకు అటవీశాఖ సిబ్బంది బంధించి, సమీపంలోని జ్యూకు తరలించారు. ఈ సింహాన్ని పెంచుకున్న ముగ్గురు కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణులను పెంచుకోవడం చట్టం ప్రకారం నేరమని పోలీసులు చెప్పారు.