: నాణ్యత లేని ఇంజనీరింగ్ కాలేజీలను మూయించేస్తా: యాజమాన్యాలను హెచ్చరించిన చంద్రబాబు


ఇంజనీరింగ్ కళాశాలల్లో వసతులు, క్వాలిటీ విద్యపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. జంబ్లింగ్ విధానంపై చర్చించేందుకు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు చంద్రబాబును కలిశాయి. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. నాణ్యత లేని ఇంజనీరింగ్ కాలేజీలను మూయించేస్తానని యాజమాన్యాలను బాబు హెచ్చరించారు. ధనార్జనే ధ్యేయంగా ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు పనిచేస్తున్నాయని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా యాజమాన్యాలు పనిచేయడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహించారు.

  • Loading...

More Telugu News