: వ్యాఖ్యాతగా వ్యవహరించడం చాలా కష్టంగా ఉన్నా... బాగుంది: రెజీనా కాసాండ్రా


హైదరాబాదులో ఐఫా అవార్డుల కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని ప్రముఖ సినీ నటి రెజీనా కాసాండ్రా తెలిపింది. అవార్డుల ఉత్సవం నిర్వహించడం ఒక ఎత్తయితే అందులో తాను వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇంకా ఆనందంగా ఉందని రెజీనా చెప్పింది. దీని కోసం తాను చాలా కష్టపడ్డానని రెజీనా తెలిపింది. అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం ఒక ఎత్తయితే, అందులో పెర్ఫార్మ్ చేయడం మరో ఎత్తని, దానికోసం చాలా రోజులుగా కష్టపడుతున్నామని రెజీనా తెలిపింది. ఏం చేసినా కార్యక్రమం ఆహూతులను అలరించడం ముఖ్యమని, అంతా అభినందిస్తున్నారని, అంటే కార్యక్రమం విజయవంతమైందని భావించవచ్చని రెజీనా తెలిపింది.

  • Loading...

More Telugu News