: హైదరాబాదుకు ప్రధాన శత్రువు ఎంఐఎం: వెంకయ్యనాయుడు
హైదరాబాదుకు ప్రధాన శత్రువు ఎంఐఎం పార్టీ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం నిధులిచ్చి, రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన హోర్డింగులు, పెట్టిన ఫ్లెక్సీలు, అంటించిన పోస్టర్లు చూసి మోసపోవద్దని ఆయన సూచించారు. అమృత్ పథకం కింద రాష్ట్రానికి 416 కోట్ల రూపాయలు ఇచ్చామని ఆయన చెప్పారు. తెలంగాణలో 55,507 ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మంచి నీటి పథకానికి కేంద్రం సాయంగా 2,500 కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన తెలిపారు. వాజ్ పేయి, చంద్రబాబు హయాంలోనే హైదరాబాదు అభివృద్ధి చెందిందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం పట్టించుకోవడం లేదని, కేంద్రం నిధులివ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు.