: అసదుద్దీన్ ఒవైసీని శిక్షించాలి: రేవంత్ రెడ్డి


ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీని శిక్షించాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోమాత తమకు తల్లితో సమానమని అన్నారు. హిందూ సంప్రదాయాలంటే గౌరవం లేని వ్యక్తులు గోమాంసం తింటామని మాట్లాడుతుంటే తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. తలతెగిపడ్డా సరే గోమాతను రక్షించుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. గోమాంసం విషయంలో లేని పోని వివాదాలు రాజేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News