: ఇద్దరు ‘చంద్రులు’ ఎందుకు రాలేదో నాకు తెలియదు: గవర్నర్ నరసింహన్


‘గవర్నర్ ఎట్ హోం’ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ రాకపోవడానికి గల కారణాలు తనకు తెలియవని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఈరోజు సాయంత్రం రాజ్ భవన్ లో ‘గవర్నర్ ఎట్ హోం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ హాజరుకాలేదు. ఈ విషయమై గవర్నర్ మాట్లాడుతూ, ఇద్దరు సీఎంలు ఈ కార్యక్రమానికి రాలేదన్నది వాస్తవమని అన్నారు. వారు రాకపోవడానికి ఏవైనా కారణాలు ఉండవచ్చని, అయితే, అవేంటన్నది తనకు తెలియదని నరసింహన్ అన్నారు.

  • Loading...

More Telugu News