: కోహ్లీ ఫీల్డింగ్ ను చెల్లాచెదురు చేసేశాడు: ఫించ్
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తమ ఫీల్డింగ్ ను చెల్లాచెదురు చేసేశాడని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఫించ్ మాట్లాడుతూ, తొలి టీట్వంటీలో ఓటమి పొందడం నిరాశకు గురిచేసిందని అన్నాడు. బౌలర్లు సమర్థవంతంగా రాణించారని ఫించ్ చెప్పాడు. కీలక సమయాల్లో మిస్ ఫీల్డ్ చేయడం టీమిండియా భారీ స్కోరుకు దోహదపడిందని ఫించ్ పేర్కొన్నాడు. ఓటమికి ప్రధాన కారణంగా ఫీల్డింగ్ తప్పిదాలని అన్నాడు. విరాట్ ఆడిన షాట్లు ఫీల్డింగ్ సెట్టింగ్ ను మార్చేసిందని ఫించ్ పేర్కొన్నాడు. తొలి టీట్వంటీలో చేసిన తప్పులు రెండో వన్డేలో చేయకుండా చూసుకుంటామని ఫించ్ తెలిపాడు.