: రాష్ట్రపతి భవన్ లో 'ఎట్ హోం' ప్రారంభం...అతిథులు హోలాండే, మోదీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నివాసంలో 'ఎట్ హోం' కార్యక్రమం ప్రారంభమైంది. గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే హాజరుకాగా, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి, ఏపీ, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్లు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.