: ఉత్తరాఖండ్ లో హైఅలర్ట్!
ఉత్తరాఖండ్ లో హైఅలర్ట్ ప్రకటించినట్లు ఆ రాష్ట్ర డీజీపీ బీఎస్ సింధు పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులుగా భావిస్తున్న ఎనిమిది మంది తమ రాష్ట్రంలో తలదాచుకున్నారనే సమాచారం ఒక వీడియో క్లిప్పింగ్ ద్వారా తమకు అందిందన్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే, ఈ వీడియో క్లిప్పింగ్ ను ఎవరు పంపించారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. తలదాచుకున్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సింధు తెలిపారు.