: గోవాలో సిరియా పౌరుడి అరెస్టు!


వీసా గడువు ముగిసినప్పటికీ గోవాలో నివాసముంటున్న సిరియా పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాసినో ప్రాంతంలో గతరాత్రి అతడిని అరెస్ట్ చేసినట్లు ఐజీ సునీల్ గార్గ్ తెలిపారు. సిరియా పౌరుడిని ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారన్నారు. వీసా గడువు తీరినప్పటికీ అతను ఇక్కడే ఉండటంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని, సిరియా పౌరుడిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ‘ఉగ్ర’ సంబంధాలు ఏవైనా ఉన్నాయా? లేవా? అనే విషయం విచారణలో తెలుస్తుందన్నారు. కాగా, సిరియా పౌరుడిని అరెస్టు చేసిన ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ధ్రువీకరించారు.

  • Loading...

More Telugu News