: ఎర్ర చీరలో అదిరిపోయిన ఐష్!


ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తో కలిసి బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ లంచ్ చేశారు. తన కూతురు ఆరాధ్యతో కలిసి ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. భారత్ లో ఫ్రెంచ్ అంబాసిడర్ ఫ్రాంకోయిస్ రిషియర్ ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐశ్వర్యారాయ్ సాంప్రదాయక దుస్తుల్లో అక్కడికి వెళ్లారు. ఎరుపు రంగు బెనారస్ చీరలో ఉన్న ఆమె అందమైన ఆభరణాలను, తలలో గులాబీపూలను ధరించింది. కాగా, భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ హాజరయ్యారు.

  • Loading...

More Telugu News