: వాఘా బోర్డర్ దిక్కులు 'భారత్ మాతాకీ జై' నినాదంతో పిక్కటిల్లాయి!


వాఘా బోర్డర్ వద్ద భారత గణతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ ప్రతి రోజూ ఆనవాయతీగా నిర్వహించే 'బీటింగ్ రిట్రీట్' కార్యక్రమానికి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా భారీ సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దుల వద్ద భారత్ మాతాకీ జై అంటూ సందర్శకులు నినదించడంతో దిక్కులు పిక్కటిల్లాయి. ఈ సందర్భంగా రెండు దేశాల సైనికులు చేసిన కవాతు సందర్శకులను అలరించింది. భారత్, పాక్ సైనికులు ఒకరికొకరు రెచ్చగొట్టుకున్న విధానం చూసిన సందర్శకులు కేరింతలు కొట్టారు. సరిహద్దుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సైనికులు భద్రతా చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News