: యువతలో దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఉంది: అద్వానీ


యువతలో దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ అభిప్రాయపడ్డారు. గణతంత్రదినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన నివాసంలో జెండా వందనం సందర్భంగా మాట్లాడుతూ, గణతంత్రదినోత్సవం నాడు అందర్లోనూ దేశభక్తి పెల్లుబకడం సర్వసాధారణమని అన్నారు. ఈ స్పూర్తిని ఏడాది మొత్తం కొనసాగేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేవలం విద్య, క్రీడల ద్వారానే కాకుండా ఇతర రంగాల ద్వారా కూడా దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. బ్రిటిష్ వారితో పోరాడి మరీ స్వాతంత్య్రం సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను ఎన్డీయే ప్రభుత్వం హరిస్తే, ప్రజలే పోరాటం చేస్తారని ఆయన చెప్పారు. అయితే, ఇప్పుడు దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు వచ్చిన నష్టమేమీ లేదని, ఏదో జరిగిపోతోందని వినిపిస్తున్న కల్పిత ప్రచారం నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఆయన నివాసంలో జరిగిన గణతంత్రదినోత్సవ వేడుకల్లో బీజేపీ సీనియర్ నేతలు పాలుపంచుకున్నారు.

  • Loading...

More Telugu News