: రాజస్థాన్ లో యుద్ధ విమానాల నుంచి జారిపడ్డ వస్తువులు!


రాజస్థాన్ లోని బార్మర్ ప్రాంతంలో యుద్ధ విమానాల నుంచి కొన్ని వస్తువులు జారిపడ్డట్లు తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారం మేరకు విచారణ నిమిత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల బృందం ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. గుగ్డి గ్రామంపై నుంచి అతి తక్కువ ఎత్తులో ఈ యుద్ధ విమానాలు ప్రయాణించాయని, వాటి నుంచి జారి పడ్డ వస్తువుల తాకిడికి కొన్ని గృహాలు కూడా దెబ్బతిన్నాయని గ్రామస్తులు చెప్పినట్లు సమాచారం. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. యుద్ధవిమానాలు వెళ్లడంతో విపరీతంగా దుమ్ము లేచి, పెద్ద శబ్దం వచ్చిందని గుగ్డి గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News