: సానియా, హింగిస్ పోరులో ఎవరిది పైచేయి?


మహిళల డబుల్స్ టెన్నిస్ వరల్డ్ నెంబర్ వన్ జోడీ సానియా మీర్జా, మార్టినా హింగిస్ ఎదురెదురుగా తలపడనున్నారు. మహిళల డబుల్స్ లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న వీరిద్దరూ మిక్సిడ్ డబుల్స్ లో వేర్వేరు ఆటగాళ్లతో జత కట్టారు. దీంతో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తో జత కట్టిన మార్టీనా హింగిస్ జోడీతో, క్రొయేషియా ఆటగాడు ఇవాన్ దొడిగ్ తో జతకట్టిన సానియా మీర్జా జోడీ తలపడనుంది. మహిళల డబుల్స్ లో పరాజయమెరుగని జంటగా వినుతికెక్కిన సానియా, హింగిస్ జోడీలో ఎవరిపై ఎవరు విజయం సాధిస్తారా? అని టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, సానియా, దొడిగ్ జంట కంటే పేస్, హింగిస్ జోడీ ఎంతో అనుభవమున్న జోడీ. వీరి అనుభవం రంగరిస్తే సానియా జోడీని నిలువరించడం పెద్ద కష్టమేమీ కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News