: ప్రపంచ 'ఎంబీఏ' జాబితాలో మూడు భారత బి-స్కూల్స్!
ప్రపంచవ్యాప్తంగా టాప్-100 ఎంబీఏ స్కూళ్ల జాబితా విడుదల కాగా, అందులో మూడు భారత బిజినెస్ స్కూళ్లకు స్థానం లభించింది. ఫైనాన్షియల్ టైమ్స్ వెలువరించిన ఈ జాబితాలో అహ్మదాబాద్ లోని ఐఐఎం, బెంగళూరులోని ఐఐఎంలతో పాటు హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) నిలిచాయి. గత సంవత్సరంతో పోలిస్తే అహ్మదాబాద్ ఐఐఎం రెండు స్థానాలు ఎగబాకి 24వ ప్లేస్ కు చేరగా, బెంగళూరు ఐఐఎం 4 స్థానాలు ఎదిగి 29వ ప్లేస్ కు, హైదరాబాద్ ఐఎస్బీ 82వ స్థానం నుంచి 62వ స్థానానికి మెరుగుపడ్డాయి. ఈ జాబితాలో తొలి స్థానంలో ఫ్రాన్స్ కు చెందిన ఇన్ సీడ్ నిలిచింది. ఆపై హార్వార్డ్ బిజినెస్ స్కూల్, లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ స్కూల్, స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ టాప్-5లో నిలిచాయి.