: ఫాల్కనర్ బాల్ వేశాడు, వికెట్లు పడ్డాయి, నోబాల్ కాకున్నా ఔట్ ఇవ్వని అంపైర్!
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ-20 9వ ఓవర్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఫాల్కనర్ వేసిన 9వ ఓవర్ రెండవ బంతికి వికెట్లు పడ్డాయి. అది నోబాల్ కాదు. అయినప్పటికీ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. ఎలాగని ఆలోచిస్తున్నారా? ఆ బంతిని ఆడాల్సిన సురేష్ రైనా, ఫాల్కనర్ పరుగు ప్రారంభించి, బంతిని చేతి నుంచి విడిచే చివరి క్షణంలో క్రీజును దాటి బయటకు వెళ్లిపోయాడు. బంతి నేరుగా వచ్చి వికెట్లను తాకినా, అంపైర్ డెడ్ బాల్ గా ప్రకటించాడు. సైడ్ స్క్రీన్ వద్ద ఎవరో అభిమానులు అటూ ఇటూ తిరుగాడగా, రైనా కొంత డిస్ట్రబ్ అయినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం భారత స్కోరు 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు.