: టాస్ గెలిచిన ఆసీస్... టీమిండియాదే ఫస్ట్ బ్యాటింగ్


భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ లో ఆసీస్ నెగ్గింది. అయితే, ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. పర్యాటక జట్టు టీమిండియాను ఫస్ట్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఆస్ట్రేలియా నగరం ఆడిలైడ్ లోని ఓవల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా తరఫున యువరాజ్ సింగ్ ఆడనున్నాడు. చాలా కాలం తర్వాత యువరాజ్ ఆడుతుండటంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది. టీమిండియా బ్యాటింగ్ ను శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News