: పఠాన్ కోట్ లో మరో కలకలం... రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద బ్యాగు


పంజాబ్ లోని పఠాన్ కోట్ ను ఉగ్రవాదుల భయం వీడలేదు. మొన్నటికి మొన్న పఠాన్ కోట్ లోని ఎయిర్ బేస్ పై జైషే మొహ్మద్ ముష్కరులు ముప్పేట దాడికి దిగారు. దాదాపు రెండు రోజులకు పైగా ఎయిర్ బేస్ లో కాల్పుల మోత మోగింది. ఏడుగురు కమెండోలను పొట్టనబెట్టుకున్న ఆరుగురు ఉగ్రవాదులు ఎన్ఎస్జీ కమెండోల బుల్లెట్లకు హతమయ్యారు. ఈ నెల 2న జరిగిన ఈ ఘటనతో రోజుల తరబడి దర్యాప్తు అధికారులు పఠాన్ కోట్ లో ముమ్మర సోదాలు చేశారు. తాజాగా పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ బ్యాగును చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. వెనువెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్ ను రప్పించి తనిఖీలు చేయిస్తున్నారు.

  • Loading...

More Telugu News