: జెండా ఆవిష్కరణపై కొట్లాట... పోలీస్ స్టేషన్ కు చేరిన కాంగ్రెస్ నేతల వివాదం


రిపబ్లిక్ దినోత్సవ వేడుకల వేళ, జెండాను ఎవరు ఆవిష్కరించాలన్న కాంగ్రెస్ నేతల వివాదం, చిలికి చిలికి గాలివానగా మారి పోలీస్ స్టేషన్ కు చేరింది. ఈ ఉదయం నల్గొండ జిల్లా భువనగిరిలోని జగదేవ్ పూర్ క్రాస్ రోడ్స్ వద్ద పార్టీ పట్టణ నేతల మధ్య గొడవ జరిగింది. పట్టణ అధ్యక్షుడు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జ్ అనుచరులు ఒకరిని ఒకరు అడ్డుకున్నారు. బర్రె జహంగీర్, కంబం అనిల్ కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రరూపమై ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆపై జెండా ఆవిష్కరణ ఆగిపోగా, ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనలో కేసు నమోదు చేయలేదని, ఏం జరిగిందన్న విషయాన్ని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News