: తెలంగాణలో కలకలం... టాయ్ లెట్ లేదని సజీవదహనం చేసుకున్న ఇంటర్ బాలిక


ఎంత కోరినా తన ఇంట్లో మరుగుదొడ్డి కట్టించడం లేదని, బహిర్భూమి నిమిత్తం బయటకు వెళ్లలేకపోతున్నానన్న మనస్తాపంతో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గుండాల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న కడపర్తి రేఖ, ఇంట్లో టాయ్ లెట్ కట్టించాలని ఎప్పటినుంచో కోరుతోంది. తల్లిదండ్రులు సత్తయ్య, నాగమ్మలు వ్యవసాయ కూలీలు కావడం, టాయ్ లెట్ కట్టించేందుకు డబ్బులేకపోవడంతో కుమార్తె కోరికను వారు వాయిదా వేస్తూ వచ్చారు. తల్లిదండ్రులు స్పందించడం లేదని ఆరోపిస్తూ, గత రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో రేఖ మరణించింది. ఆమె గన్నీ బ్యాగులు చుట్టిన ప్రాంతంలో స్నానం చేస్తుండటం, బహిర్భూమికి బయటకు వెళ్లాల్సి రావడంతో అవమానాలను ఎదుర్కొని ఉండవచ్చని భావిస్తున్నామని, ఆమెను ఎవరైనా వేధించారా? అన్న కోణంలో విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News