: అనంతనాగ్ లో ఎన్ కౌంటర్... ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం


గణతంత్ర దినోత్సవాన దేశంలో బీభత్సం సృష్టించేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టింది. జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో నేటి తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో సైనికులు ఓ ఉగ్రవాదిని కాల్చిపారేశారు. జిల్లాలోని కోకెర్ నాగ్ ప్రాంతంలో దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదిని గమనించిన సైన్యం కాల్పులు జరిపింది. అవతలి వైపు నుంచి కాల్పులు జరిగాయి. హోరాహోరీగా జరిగిన కాల్పులు కాసేపట్లోనే ఆగిపోయాయి. ఆ తర్వాత అక్కడ సోదాలు చేసిన సైన్యం ఓ ఉగ్రవాది మృతదేహాన్ని కనుగొంది. ఇంకా ఉగ్రవాదులెవరైనా ఉన్నారా? అన్న కోణంలో అక్కడ సైన్యం ముమ్మరంగా సోదాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News