: నారింజ రంగు తలపాగాతో కదిలిన మోదీ!


భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ పథ్ లో జరిగే రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరారు. నారింజ రంగు తలపాగా, ముదురు బూడిద రంగు కోటు ధరించి వచ్చిన ఆయన, ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతి వద్ద నివాళులు అర్పించారు. ఆయనకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తో పాటు త్రివిధ దళాధిపతులు స్వాగతం పలికారు. కాగా, మొత్తం ఏడంచెల భద్రత మధ్య దేశ రాజధాని శత్రు దుర్భేద్యంగా మారిపోయింది. భారీ స్థాయిలో మోహరించిన పోలీసులు కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News