: 1,500 మదర్సాల్లో ఆరెస్సెస్ ఆధ్వర్యంలో జాతీయ జెండావిష్కరణ!...‘ముస్లిం రాష్ట్రీయ మంచ్’ పేరిట కరసేవకుల కొత్త సంస్థ


భారత 67వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సరికొత్త వ్యూహానికి తెర తీసింది. ఇస్లామిక్ విద్యాబోధన కోసం ఏర్పాటైన మదర్సాల్లో జాతీయ పతాకావిష్కరణకు ఆ సంస్థ సన్నాహాలు పూర్తి చేసింది. ఇందుకోసం కొత్తగా ఆ సంస్థ ‘ముస్లిం రాష్ట్రీయ మంచ్’ పేరిట కొత్త అనుబంధ సంస్థకు అంకురార్పణ చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్తంగా 1,500 మదర్సాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నట్లు ఆరెస్సెస్ ప్రకటించింది. హర్యానాలోని పంచ్ కుల సమీపంలోని రాయ్ పురానీ మదర్సాలో సీనియర్ కర సేవకుడు ఇంద్రేశ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోని అన్ని విద్యా సంస్థల్లో మాదిరిగానే మదర్సాల్లోనూ జాతీయ పతాకాలను ఆవిష్కరించడంతో పాటు దేశభక్తి గీతాలను ఆలపించనున్నాయని ఇంద్రేశ్ కుమార్ ను ఊటంకిస్తూ ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నేటి తన సంచికలో ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది.

  • Loading...

More Telugu News