: జాతీయ పతాకం రెపరెపలు... బీజేపీ కార్యాలయంలో అమిత్ షా, ఆరెస్సెస్ ఆఫీస్ లో భగవత్


భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యాలయంలోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నాగ్ పూర్ లోని ఆ సంస్థ కార్యాలయంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News