: బుల్లెట్ల వర్షం కింద శాంతి చర్చలు సాద్యం కాదు: గణతంత్ర సందేశంలో రాష్ట్రపతి ప్రణబ్
భారత 67వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. తన ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించిన ప్రణబ్, ఉగ్రవాద ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు దేశాలన్నీ కలిసికట్టుగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక దాయాది దేశం పాకిస్థాన్ తో చర్చల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ప్రణబ్... చర్చలను నిలుపుదల చేస్తూ నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. బుల్లెట్ల వర్షం కింద శాంతి చర్చలు నిర్వహణ సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. జీడీపీలో 7.3 వృద్ధి అంచనాతో భారత్ భవిష్యత్తులో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కూడా ప్రణబ్ పేర్కొన్నారు.