: బెజవాడలో ‘రిపబ్లిక్’ వేడుకలు షురూ!... పంచెకట్టులో వచ్చిన ఐవైఆర్


భారత గణతంత్ర వేడుకలు మొదలయ్యాయి. ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ గ్రౌండ్స్ లో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. వేడకలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. పోలీసుల నుంచి గవర్నర్ నరసింహన్ గౌరవ వందనం స్వీకరించనున్నారు. డీజీపీ జేవీ రాముడు సహా సీనియర్ పోలీసు అధికారులు ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే వారికి కేటాయించిన స్థానాల్లో ఆసీనులయ్యారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో వేడుకలకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News