: ఐవైఆర్ కు ‘విరమణ’ లేదు!... రిటైర్మెంట్ తర్వాతా సేవల వినియోగానికి చంద్రబాబు నిర్ణయం


సీనియర్ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు నిజంగా పదవీ విరమణ లేదు. ఎందుకంటే, రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన సేవలను వినియోగించుకోవాలని ఏపీ సర్కారు తీర్మానించింది. నిన్న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఈ నెల 31న ఐవైఆర్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా కేబినెట్ ఆయన సేవలను కొనియాడింది. కీలక సమయంలో సమర్థవంతంగా పనిచేయడమే కాక, ఎలాంటి వివాదాలు లేకుండా ఆయన మెరుగ్గా రాణించారు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు, రిటైర్మెంట్ తర్వాత కూడా ఐవైఆర్ సేవలను వినియోగించుకోవాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. పదవీ విమరణ తర్వాత ఐవైఆర్ ను ఏ విధంగా వినియోగించుకోవాలన్న విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

  • Loading...

More Telugu News