: ఏపీలో ఖైదీలకు ‘రిపబ్లిక్’ బహుమానం...సత్ప్రవర్తన కలిగిన 400 మంది ఖైదీల విడుదల
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఏపీ సర్కారు బంపరాఫర్ ప్రకటించింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో సత్ప్రవర్తన కలిగిన 400 మంది ఖైదీలకు జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని తీర్మానించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్షను అనుభవిస్తూ సత్ప్రవర్తన కలిగిన 400 మంది ఖైదీలు నేడు విడుదల కానున్నారు.