: రామోజీరావుకు అభినందనలు తెలిపిన వైఎస్ జగన్
సాహిత్యం, విద్య, జర్నలిజం రంగాల్లో విశేష సేవలందించినందుకుగాను పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా ‘పద్మ’ పురస్కారాలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు అందరికీ జగన్ అభినందనలు తెలిపారు.