: ఆ వార్తల్లో వాస్తవం లేదు... ఆ కార్యక్రమానికి నేను వెళ్లడం లేదు: సచిన్ టెండూల్కర్
తమిళ నటులు గ్రూప్ లుగా ఏర్పడి ఆడుతున్న సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో తాను ముఖ్య అతిథిని కాదని, ఆ కార్యక్రమంలో తాను పాల్గొనడం లేదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ నెల 29వ తేదీన దుబాయ్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో సచిన్ ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులు ప్రదానం చేస్తారనన్న వార్తలు వినిపించాయి. ఆ వార్తలు అబద్ధమని.. తాను వెళ్లడం లేదని, ఆ రోజున తాను ఇండియాలోనే ఉంటున్నానని సచిన్ స్పష్టం చేశారు.