: ఈ గౌరవం నా ఒక్కడిదే కాదు.. తెలుగు ప్రజలందరిది: ‘ఈనాడు’ రామోజీరావు


‘ఈ గౌరవం నా ఒక్కడిదే కాదు.. తెలుగు ప్రజలందరిది’ అని రామోజీ గ్రూపు సంస్థల చైర్మర్ రామోజీరావు అన్నారు. సాహిత్యం, విద్య, జర్నలిజం రంగాల్లో విశేష సేవలందించినందుకు గాను ఆయన పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావు మీడియాతో మాట్లాడుతూ, ‘సమున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారంతో నన్ను సత్కరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వానికి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వినమ్రతతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అరుదైన ఈ పురస్కారానికి నన్ను గుర్తించిన నిర్ణేతలకు ధన్యవాదాలు. ఈ గౌరవం నా ఒక్కడిదే కాదు.. ఈనాడు, ఈటీవీలతో పాటు నేను చేపట్టిన మీడియా సంస్థలన్నింటిపై అవ్యాజమైన ప్రేమాభిమానాలు కురిపించి.. వాటికి వెన్నదన్నుగా నిలిచిన తెలుగు ప్రజలందరిదీ. అందుకే ఈ పురస్కారాన్ని తెలుగు వారందరికీ అంకితమిస్తున్నాను’ అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News