: ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధిస్తా: సైనా నెహ్వాల్


ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధిస్తానని పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అన్నారు. తనకు దక్కిన ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ పురస్కారాన్ని తన తల్లిదండ్రులకు, కోచ్ విమల్ కుమార్ కు అంకితమిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ పురస్కారంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని సైనా పేర్కొంది. గతంలో ఈ అవార్డు రానందుకు ఎంతో బాధపడ్డారు కదా, ఇప్పుడు సంతోషంగా ఉందా? అనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, ‘పాస్ట్ ఈజ్ పాస్ట్ అనీ, దాని గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదని, తన దృష్టి అంతా ఆటపైనే ఉందని సైనా చెప్పారు. కాగా, సైనా తండ్రి హర్వీందర్ సింగ్ మాట్లాడుతూ, అంకితభావంతోనే సైనా ఈ స్థాయికి వచ్చిందని, తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ స్థాయికి రావడానికి ఎంతగానో కృషి చేసిన కోచ్ లకు తమ కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News