: టీఆర్ఎస్ 100 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఎర్రబెల్లి
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ చేశారు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని టీడీపీ కార్యాలయాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ సింబల్ పై గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థులుగా తిరిగి పోటీచేయాలని డిమాండ్ చేశారు.