: బీఫ్ తినేవారు బీజేపీకి ఓటు వేయక్కర్లేదు: ఎమ్మెల్యే రాజాసింగ్


‘బీఫ్’పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆవు, ఎద్దు మాంసం తినేవారు బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. అసదుద్దీన్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. గో వధను బీజేపీ వంద శాతం అడ్డుకుంటుందని, బీఫ్ గురించే మాట్లాడితే తాము ఊరుకోమని రాజాసింగ్ హెచ్చరించారు. ఇదే అంశంపై బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ, గో హత్యకు తాము వ్యతిరేకమని, ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. కమ్యూనల్ హైదరాబాద్ గా మార్చే ప్రయత్నం ఒవైసీ చేస్తున్నారని ఆరోపించారు. బీఫ్ నిషేధిత అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందని అన్నారు. కాగా,‘గ్రేటర్’ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఓడిపోతే హైదరాబాద్ లో బీఫ్ తినే అవకాశం కోల్పోతామంటూ ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News