: హైదరాబాద్ కేంద్రంగా మనుషుల అక్రమ రవాణా!
హైదరాబాద్ కేంద్రంగా మనుషుల అక్రమ రవాణాకు ఒక ముఠా పాల్పడుతోంది. మేల్ సర్వెంట్ పేరిట మహిళలను గల్ఫ్ దేశాలకు ఈ ముఠా పంపుతోంది. ఎనిమిది మంది సభ్యులు గల ఈ ముఠాను శంషాబాద్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో ఇమ్మిగ్రేషన్ ఎస్సై, జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగి, పాస్ పోర్ట్ ఏజెంట్, నలుగురు ట్రావెల్ ఏజెంట్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా మనుషుల అక్రమ రవాణా జరుగుతోందన్నారు. గడచిన రెండేళ్లలో సుమారు నాలుగు వేల మందిని నకిలీ పత్రాలతో గల్ఫ్ దేశాలకు ఈ ముఠా పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.