: సరైన ఫిట్ నెస్ ఉంటేనే జట్టులో ఉంటారు: రవిశాస్త్రి


ట్వంటీ 20 వరల్డ్ కప్ కు ఆటగాళ్లను ఎంపిక చేయడమంటే... సూపర్ మార్కెట్ లో ఒక వస్తువును కొనుగోలు చేసినట్లుకాదని, క్రీడాకారుల ఫిట్ నెస్ ముఖ్యమని టీం ఇండియ మేనేజర్ రవిశాస్త్రి అన్నారు. త్వరలో జరగనున్న ట్వంటీ 20 వరల్డ్ కప్ కు సీనియర్ ఆటగాళ్లు యువరాజ్, హర్భజన్ , ఆశిష్ లను ఎంపిక చేస్తారా? అన్న ప్రశ్నకు రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించారు. జట్టు ఎంపిక సమయానికి వారు ఫిట్ నెస్ తో ఉంటే తప్పకుండా జట్టులోకి వస్తారని అన్నారు. ఐసీసీ ట్వంటీ 20 వరల్డ్ కప్ సన్నాహకంలో భాగంగా మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో మూడు ట్వంటీ 20 సిరీస్ కు టీమిండియా సన్నద్ధమవుతోంది. పలు రకాలైన ఆటగాళ్లకు ఛాన్స్ లు ఇవ్వడమే తమ ఉద్దేశమని రవిశాస్త్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News