: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ ను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు


హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చేస్తున్న టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అనుకోని షాక్ తగిలింది. ఇవాళ అమీర్ పేట సత్యం థియేటర్ వద్ద మాట్లాడుతున్న ఆయనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను అడ్డుకున్నారు. ఈ గొడవతో రేవంత్ వెనక్కి తిరిగి వెళ్లిపోయారని సమాచారం.

  • Loading...

More Telugu News