: ధర్మాన పిటిషన్ పై తీర్పు సోమవారానికి వాయిదా
ప్రాసిక్యూషన్ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా ధర్మానపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రిగా ఉన్న ధర్మాన విచారణకు ఆటంకం కలిగిస్తున్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. మంత్రిత్వ శాఖ మారినా, ఆయన్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా సీబీఐ పేర్కొంది.