: కేరళలో వరల్డ్ ఫుట్ బాల్ స్టార్ రొనాల్డినో... తృటిలో తప్పిన పెను ప్రమాదం
బ్రెజిల్ ఫుట్ బాల్ ప్రపంచంలో పీలే తరువాత వినిపించే పేరు రొనాల్డినో అనడంలో సందేహం లేదు. అంతటి అద్భుత ఆటగాడు అతను. వరల్డ్ కప్ ను బ్రెజిల్ గెలుచుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అటువంటి రొనాల్డినో ఇండియాకు వచ్చాడు. నడక్కావులోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగిన నాగ్ జీ ఇంటర్నేషనల్ క్లబ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వచ్చాడు. కార్యక్రమం అనంతరం, ఈ ఉదయం తిరువనంతపురంలో పర్యటిస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కారులో వెళుతున్న వేళ, ఓ ట్రాఫిక్ సిగ్నల్ పోల్ అమాంతం ఆయన కారుపై పడింది. దీన్ని ముందుగానే గమనించిన డ్రైవర్ బ్రేకు వేసి కారును నిలిపాడు. అప్పటికీ ఆ పోల్ కారుపైనే పడింది. ఈ ప్రమాదంలో రొనాల్డినోకు ఎటువంటి ప్రమాదమూ జరగలేదు.