: మరో పుస్తకం రాస్తున్న రాంగోపాల్ వర్మ!


‘నా ఇష్టం’, ‘గన్స్ అండ్ థైస్’ పుస్తకాలను రాసిన వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో పుస్తకరచనకు శ్రీకారం చుట్టాడు. ఆ పుస్తకం పేరు ‘గన్స్ అండ్ బూబ్స్’. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వర్మ వెల్లడించారు. ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను తాను కలిసిన సందర్భంలో ఆయన పలు విషయాలు తనతో పంచుకున్నాడని చెప్పారు. దావూద్ కు ఎదురైన అనుభవాలు, మాఫియా సామ్రజ్యాన్ని తాను ఏ విధంగా నడిపించాడు, మొదలైన విషయాలను ఈ కొత్త పుస్తకంలో రాస్తున్నట్లు వర్మ ట్వీట్ లో పేర్కొన్నారు. గత ఇరవై ఏళ్లలో దావూద్ కు సంబంధించిన ఏ ఒక్క ఫోటో బయటకు రాకపోవడం తనకు చాలా ఆశ్చర్యం కల్గించే విషయమని వర్మ అన్నారు.

  • Loading...

More Telugu News