: జైపూర్ లో గాంధీ విగ్రహం ధ్వంసం... 'ఐసిస్' నినాదాలు!
జైపూర్ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి అపచారం తలపెట్టారు. ఆయన విగ్రహం ముఖం, తల భాగాలను పగలగొట్టడంతో పాటు 'ఐసిస్ జిందాబాద్' అని నినాదాలు రాశారు. ఈ ఘటన ఈ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరుపుతూ, పలువురు ఉగ్ర అనుమానితులను అదుపులోకి తీసుకున్న వేళ వెలుగుచూసిన ఈ ఘటన కలకలం రేపింది.