: ఘనంగా నటి అసిన్, రాహుల్ శర్మ వెడ్డింగ్ రిసెప్షన్


మైక్రోమ్యాక్స్ సహవ్యవస్థాపకుడు రాహుల్ శర్మను ఈ నెల 19న క్రిస్టియన్, హిందూ సంప్రదాయ పద్ధతుల్లో సినీ నటి అసిన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈ నెల 24న ముంబయిలో సినీ పరిశ్రమ సన్నిహితులకు గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నలుపు రంగు కుర్తా, తెలుపు రంగు పైజామా రాహుల్ ధరించగా.. అసిన్ క్రీమ్, లైట్ గోల్డ్ రంగు లెహంగాలో మెరిసిపోయింది. సినీ నటులు అక్షయ్ కుమార్, సుష్మితా సేన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, శిల్పాశెట్టి దంపతులు, అభిషేక్ బచ్చన్, రితేశ్, జెనీలియా దేశ్ ముఖ్ దంపతులు, ప్రీతి జింటా, సుస్మితాసేన్, మనీష్ పాల్, మాధవన్, ఖుష్బూ, టబు, దర్శకుడు బాల్కీ, వెంకటేష్, రానా తదితరులు హాజరయ్యారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. రిసెప్షన్ లో జాక్వెలిన్ తో కలసి రాహుల్, అసిన్ లు సరదాగా డాన్స్ వేశారు. రిసెప్షన్ సందర్భంగా దిగిన ఫోటోలను అసిన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.

  • Loading...

More Telugu News